- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘‘త్వరగా రెడీ అవ్వు.. నీతో సెక్స్ చేయాలనుకుంటున్నా..’’ ఆరోగ్య శాఖలో దుమారం రేపుతున్న ఆడియో కాల్
హర్యానా యమునా నగర్‌లో జరిగిన సంఘటన ఆరోగ్య శాఖలో దుమారం రేపుతోంది. సివిల్ హాస్పిటల్‌లో హెల్త్ డిపార్ట్‌మెంట్ ప్రాజెక్ట్‌లో పని చేస్తున్న ఓ మహిళా డాక్టర్‌ను జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ లైంగిక వేధింపులకు గురిచేశాడు. ఆరోగ్య సేవలను పర్యవేక్షించాల్సిన సీనియర్ అధికారి.. దళిత

దిశ, వెబ్ డెస్క్ : హర్యానా యమునా నగర్‌లో జరిగిన సంఘటన ఆరోగ్య శాఖలో దుమారం రేపుతోంది. సివిల్ హాస్పిటల్‌లో హెల్త్ డిపార్ట్‌మెంట్ ప్రాజెక్ట్‌లో పని చేస్తున్న ఓ మహిళా డాక్టర్‌ను జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ లైంగిక వేధింపులకు గురిచేశాడు. ఆరోగ్య సేవలను పర్యవేక్షించాల్సిన సీనియర్ అధికారి.. దళిత వర్గానికి చెందిన లేడీ డాక్టర్‌ను టార్గెట్ చేస్తూ రిపీటెడ్ కాల్స్ చేశాడు. దీంతో విసిగిపోయిన ఆమె ఓ కాల్ రికార్డ్ చేసి రిలీజ్ చేసింది.
వర్క్ మీటింగ్స్ పేరుతో డ్యూటీ అయిపోయాక చాలా సార్లు కాల్స్ చేసి వేధిస్తున్నాడని.. ఆఫీసుకు పిలుస్తున్నాడని డాక్టర్ మంజీత్ సింగ్‌పై ఆరోపణలు చేసిన లేడీ డాక్టర్.. మూడు నిమిషాల 26 సెకన్ల ఆడియో రికార్డింగ్‌ను సాక్ష్యంగా బయటపెట్టింది. ‘త్వరగా రెడీ అవ్వు.. నీతో సెక్స్ చేయాలనుకుంటున్నా.. లేదంటే ఫ్యూచర్‌లో ఏ పని కోసం నా దగ్గరికి రావద్దు’ అని, 15 నిమిషాల్లో రావాలని ఒత్తిడి చేశాడు. దళిత కుటుంబానికి చెందిన దానివి అంటూ అవమానకరంగా మాట్లాడాడు. ప్రమోషన్లు, ప్రాజెక్ట్స్ ఆపేస్తానని బెదిరించాడు. ఈ విషయాన్ని అసిస్టెంట్ సూపరిండెంట్ ఆప్ పోలీసుకు ఫిర్యాదు చేసిన బాధితురాలు.. కేసు పెట్టింది. దీనిపై విచారించిన కోర్టు.. నేరం తీవ్రత, ప్రాథమిక సాక్ష్యాలను ఆధారంగా చేసుకుని డాక్టర్ సింగ్‌కు బెయిల్ తిరస్కరించింది. ప్రస్తుతం అతను పరారీలో ఉండగా.. లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు.






