- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జీవితంపై విరక్తి చెంది తాపీ మేస్త్రి ఆత్మహత్య
దిశ, కామారెడ్డి : పక్షవాతంతో బాధపడుతున్న ఓ తాపీ మేస్త్రి జీవితంపై విరక్తి చెంది రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కామారెడ్డి పట్టణంలో

దిశ, కామారెడ్డి : పక్షవాతంతో బాధపడుతున్న ఓ తాపీ మేస్త్రి జీవితంపై విరక్తి చెంది రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కామారెడ్డి పట్టణంలో శుక్రవారం చోటు చేసుకుంది రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి రుక్మిణి కుంట ఏరియాలో నివాసముంటున్న తాపీ మేస్త్రీ తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు అలియాస్ కన్నయ్య (62) ప్రకాశం జిల్లా నుంచి 40 సంవత్సరాల క్రితం వచ్చి కామారెడ్డిలో తాపీ మేస్త్రి గా పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఇతనికి నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే నలుగురు కుమార్తెల పెళ్లిళ్లు అయ్యాయి. కుమారుల పెళ్లిళ్లు కాలేదు. కుమారులు ప్రస్తుతం తాపీ మేస్త్రిలు గా కామారెడ్డి లో పని చేస్తున్నారు. ఇతనికి సుమారు రెండు సంవత్సరాల కిందట పక్షవాతం వచ్చింది. దీంతో సరిగ్గా నడవలేకపోతున్నాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని భార్య రమణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్సై సాధు లింబాద్రి తెలిపారు.






