- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ పోలీసుల బిగ్ ఆపరేషన్.. 35 మంది మావోయిస్టులు సరెండర్!
వరుస కూంబింగ్ ఆపరేషన్లతో మావోయిస్టు పార్టీ సతమతం అవుతోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: వరుస కూంబింగ్ ఆపరేషన్లతో మావోయిస్టు పార్టీ సతమతం అవుతున్న తరుణంలో మరో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. తెలంగాణ పోలీసులు చేపట్టిన మేజర్ ఆపరేషన్‌లో ఏవోబీ కమాండర్ ఎర్రోళ్ల రవితో పాటు 35 మంది మావోయిస్టులు సరెండర్ అయినట్లుగా తెలుస్తోంది. అందులో హిడ్మా బెటాలియన్ కమాండర్స్ కూడా ఉన్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇవాళ డీజీపీ కార్యాలయం నుంచి కీలక ప్రకటన వెలువడింది. మధ్యాహ్నం 2.30 గంటలకు డీజీపీ కార్యాలయంలోని టెన్నిస్ కోర్టు గ్రౌండ్‌లో డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy) మీడియా సమావేశాన్ని నిర్వహించనున్నట్లుగా కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. వార్తాపత్రికల రిపోర్టర్లు, ఫొటో, వీడియో జర్నలిస్టులు హాజరు కావాలని డీజీపీ సీపీఆర్వో శ్రీనివాస రావు మీడియాకు సమాచారమిచ్చారు.
Next Story






