గండిపేట చెరువులో మృతదేహం లభ్యం

by Nallavelli.Anjaneyulu |

గండిపేట చెరువులో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది.

గండిపేట చెరువులో మృతదేహం లభ్యం
X

దిశ, గండిపేట : గండిపేట చెరువులో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. ఇన్ స్పెక్ట‌ర్ హ‌రికృష్ణారెడ్డి తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఆదివారం ఖానాపూర్ నుంచి శంకరపల్లి వైపు మార్గంలో హా టీ పాయింట్ ఎదురుగా ఉన్న ఓ ఫార్మహౌజ్ వెనుక వైపు గల గండిపేట చెరువు లో ఓ వ్యక్తి (50) మృతదేహం లభ్యమైంది. అతడు ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయాడా లేదా ఇంకెక్కడైనా చెరువులో పడి గాలికి ఇక్కడికి కొట్టుకొని వచ్చి ఉంటాడా అని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడికి సంబంధించిన వివరాలు తెలియ‌దు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి సంబంధీకులు నార్సింగి పోలీస్ స్టేషన్ లు 8712568341, 8712663119 నెంబర్లలో సంప్రదించాలని ఇన్ స్పెక్ట‌ర్ హరికృష్ణా రెడ్డి సూచించారు.

Next Story