- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘోర రోడ్డు ప్రమాదం.. డ్రైవర్ సజీవదహనం
by Gantepaka Srikanth |
ప్రకాశం జిల్లా(Prakasam District) రాచర్ల మండలం రంగారెడ్డిపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రకాశం జిల్లా(Prakasam District) రాచర్ల మండలం రంగారెడ్డిపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎంను గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. దీంతో డీసీఎంలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ అక్కడిక్కడే సజీవదహనం(DCM Driver Dead) అయ్యారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడు అనంతపురం జిల్లాకు చెందిన స్వామిగా గుర్తించారు. కాకినాడ నుంచి అనంతపురం వైపునకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన కారణాలపై ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






