శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ తనిఖీలు.. రూ.14 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

by Kema Shiva Kumar |

హైదరాబాద్‌ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (RGIA) వేదికగా జరుగుతున్న మత్తు పదార్థాల అక్రమ రవాణాకు కస్టమ్స్ అధికారులు మరోసారి బ్రేక్ వేశారు.

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ తనిఖీలు.. రూ.14 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (RGIA) వేదికగా జరుగుతున్న మత్తు పదార్థాల అక్రమ రవాణాకు కస్టమ్స్ అధికారులు మరోసారి బ్రేక్ వేశారు. ఇవాళ ఉదయం ఇంటర్నేషనల్ అరైవల్స్ వద్ద జరిపిన ఆకస్మిక తనిఖీల్లో సుమారు రూ.14 కోట్ల విలువైన అత్యంత ఖరీదైన హైడ్రోపోనిక్ గంజాయి (Hydroponic Cannabis)ని స్వాధీనం చేసుకున్నారు. ఖతార్ (Qatar) నుంచి ఖతార్ ఎయిర్‌లైన్స్‌ విమానంలో హైదరాబాద్ (Hyderabad) చేరుకున్న ఇద్దరు ప్రయాణికులపై అనుమానం రావడంతో కస్టమ్స్ అధికారులు వారిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వారి వద్ద ఉన్న లగేజీని స్కానింగ్ చేయగా, లోపల రహస్యంగా దాచి ఉంచిన గంజాయి పొట్లాలు బయటపడ్డాయి. అనంతరం వారి నుంచి 14 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో దొరికిన సరుకు విలువ సుమారు రూ.14 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఇద్దరు నిందితులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Next Story