చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ తనిఖీలు.. రూ.3.8 కోట్ల విలువైన గంజాయి సీజ్

by Kema Shiva Kumar |   (  Updated:2025-06-14 15:49:51  IST  )

దేశ వ్యాప్తంగా డ్రగ్స్ మాఫియాను సమూలంగా నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం (Central Government) ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది.

చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ తనిఖీలు.. రూ.3.8 కోట్ల విలువైన గంజాయి సీజ్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా డ్రగ్స్ మాఫియాను సమూలంగా నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం (Central Government) ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల్లోని టాస్క్‌ఫోర్స్ (Taskforce), నార్కోటిక్ బ్యూతో, పోలీసు సిబ్బందికి విస్తృతంగా తనిఖీలు చేపట్టి డ్రగ్స్ పెడ్లర్ల ఆట కట్టించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే దేశంలోని ప్రధాన ఎయిర్‌పోర్టులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. అయితే, శుక్రవారం రాత్రి చెన్నై ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్టు (Chennai International Airport)లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఇద్దరు ప్రయాణికులు థాయ్‌లాండ్ (Thailand) నుంచి శ్రీలంక (Srilanka) మీదుగా చెన్నైకి చేరుకున్నారు. అనుమానం వచ్చిన అధికారులు వారితో పాటు లగేజీని చెక్ చేయగా.. సుమారు 3.8 కోట్ల విలువైన గంజాయితో పాటు డ్రగ్స్ లభించాయి. అయితే, ఎవరికి అనుమానం రాకుండా నిందితులు మాదక ద్రవ్యాలను ఆహార పదార్థాల్లో కపబడకుండా ప్యాక్ చేసి బెంగళూరు తరలిస్తున్నట్లుగా కస్టమ్స్ అధికారులు వెల్లడించారుు.

Next Story