విద్యుత్ శాఖలో అవినీతి తిమింగలాలు.. పక్కా ఆధారాలతో కంప్లైంట్ చేసిన కాంట్రాక్టర్

by Gantepaka Srikanth |

హైదరాబాద్‌లోని సంతోష్ నగర్ సబ్‌ డివిజన్‌లో లైన్ ఇన్‌స్పెక్టర్లు, లైన్మెన్‌, ఆర్టిసన్లు అవినీతిలో పాలుపంచుకుంటున్నారంటూ సీనియర్ కాంట్రాక్టర్ మొహద్ బషీరుద్దీన్‌ ఫిర్యాదు చేశారు.

విద్యుత్ శాఖలో అవినీతి తిమింగలాలు.. పక్కా ఆధారాలతో కంప్లైంట్ చేసిన కాంట్రాక్టర్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని సంతోష్ నగర్ సబ్‌ డివిజన్‌లో లైన్ ఇన్‌స్పెక్టర్లు, లైన్మెన్‌, ఆర్టిసన్లు అవినీతిలో పాలుపంచుకుంటున్నారంటూ సీనియర్ కాంట్రాక్టర్ మొహద్ బషీరుద్దీన్‌ ఫిర్యాదు చేశారు. బిల్లులు అక్రమంగా వసూలు చేయడం, అపార్ట్మెంట్‌లో అక్రమంగా మీటర్ల మరియు మీటర్ ట్యాంపరింగ్‌, లంచాలు తీసుకోవడం వంటి అక్రమాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఈ ఫిర్యాదుపై TGSPDCL రెవెన్యూ వింగ్‌ దృష్టిడ సారించింది. చీఫ్ జనరల్ మేనేజర్‌ సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌కు కీలక ఆదేశాలు జారీ చేసింది. పూర్తిస్థాయి దర్యాప్తు నివేదిక సమర్పించాలని సూచించారు.

విద్యుత్‌ పంపిణీ సంస్థకు చెందిన సిబ్బంది లేదా అధికారులు లంచం అడిగితే తమకు తెలియజేయాలని సంస్థ సీఎండీ ముషారఫ్‌ ఫరూఖీ ఇప్పటికే తెలిపారు. ఈ మేరకు సీఎండీ కార్యాలయంలో అవినీతి ఫిర్యాదులు స్వీకరించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. లంచం అడిగితే 040 - 2345 4884 లేదా 7680901912 నంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చని ఓ ప్రకటనలో తెలిపారు.

Next Story