- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ట్రాక్టర్-బైకు ఢీ.. వ్యక్తి మృతి
దిశ, చందంపేట : ట్రాక్టర్-బైకు ఢీ కొనడంతో ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన చందంపేట మండల పరిధిలో

X
దిశ, చందంపేట : ట్రాక్టర్-బైకు ఢీ కొనడంతో ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన చందంపేట మండల పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై లోకేష్ తెలిపిన వివరాల ప్రకారం.. చందంపేట మండలం గాగిళ్లాపురం గ్రామ శివారులో బుడ్డోని తండాకు చెందిన లింగాల వెంకటయ్య(42) బైకు పై వెళ్తుండగా.. గాగిళ్లపూర్ గ్రామానికి చెందిన కడారి సైదులు కి చెందిన స్వరాజ్ ట్రాక్టర్ బైకును ఢీ కొట్టింది. దీంతో బైకు నడుపుతున్న వెంకటయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. బైకు పై ఉన్న మృతుడి లింగాల శోభ, కూతురు లింగాల సంధ్య(16) తీవ్రంగా గాయపడ్డారు. మృతుని భార్య శోభ ఫిర్యాదు మేరకు ఎస్సై లోకేష్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
Next Story






