- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
11 మంది చిన్నారుల ప్రాణం తీసిన దగ్గు మందు.. డాక్టర్ అరెస్ట్
మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో కోల్డ్రిఫ్ అనే దగ్గు సిరప్ తాగి 11 మంది చిన్నారులు చనిపోయిన సంగతి తెలిసిందే. కాగా ఆ సిరప్ సూచించిన డాక్టర్ ప్రవీణ్ సోనీని పరాసియా ప్రాంతంలో పోలీసులు అరెస్ట్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్: మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో కోల్డ్రిఫ్ అనే దగ్గు సిరప్ తాగి 11 మంది చిన్నారులు చనిపోయిన సంగతి తెలిసిందే. కాగా ఆ సిరప్ సూచించిన డాక్టర్ ప్రవీణ్ సోనీని పరాసియా ప్రాంతంలో పోలీసులు అరెస్ట్ చేశారు. కోల్డ్రిఫ్ సిరప్ తాగడం వల్లనే పదిహేనురోజుల్లో చిన్నారులు కిడ్నీలు ఫెయిల్ అవ్వడంతో మరణించారని దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలోనే సిరప్ తయారు చేసిన ఫార్మాతో పాటు డాక్టర్ ప్రవీణ్ సోనీని సైతం అరెస్ట్ చేశారు.
ప్రవీణ్ సోనీ ప్రభుత్వ వైద్యుడు అయినప్పటికీ అతడికి చింద్వారాలో ఓ ప్రైవేట్ క్లినిక్ కూడా ఉంది. ఈ క్లినిక్ కు చింద్వారా చుట్టుపక్కల నుండి చాలా మంది పేషెంట్లు వస్తుంటారు. ఈ క్రమంలో పలువురు చిన్నారులకు కోల్డ్రిఫ్ సిరప్ సూచించగా వారు తీవ్ర అస్వస్థతకు గురై కన్నుమూశారు. దీంతో వెంటనే ఆ సిరప్ అమ్మాకాలు నిలిపివేయాలని, తయారీ సైతం ఆపేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వాటిని డాక్టర్లు ఎవరూ సూచించవద్దని హెచ్చరించింది.






