చదువుకో.. పరీక్షలు ఎలా రాస్తావ్.. అన్నందుకు పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య

by Bhoopathi Nagaiah |

పరీక్షల ఒత్తిడిని తట్టుకోలేక పదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన కంబదూరు మండలంలో చోటుచేసుకుంది.

చదువుకో.. పరీక్షలు ఎలా రాస్తావ్.. అన్నందుకు పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య
X

దిశ, కళ్యాణదుర్గం : పరీక్షల ఒత్తిడిని తట్టుకోలేక పదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన కంబదూరు మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. పదో తరగతి చదువుతున్న మైథిలిని గత శనివారం ఆమె తల్లి చదువుపై మందలించిందని తెలిపారు. పదో తరగతి పరీక్షలు ఎలా రాస్తావని మందలించడంతో మనస్థాపానికి గురైన మైథిలి ఇంట్లో ఉన్న ఐరన్ టాబ్లెట్లు మింగింది. కొంతసేపటికి కడుపు నొప్పితో బాధపడుతూ ఇంట్లోనే అరవడంతో గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కంబదూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. అక్కడ కూడా ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు.

తల్లిదండ్రులు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మైథిలి మంగళవారం ఉదయం మృతి చెందినట్లు ఎస్ఐ లోకేష్ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మార్చి 16న నిర్వహించిన తొలి పరీక్షకు విద్యార్థి హాజరు కాలేదని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. కూతురు మృతి పట్ల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో కంబదూరులో విషాదఛాయలు అలుముకున్నాయి.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story