చైల్డ్​ పోర్నోగ్రఫీ కేసులపై సీఐడీ ఛీఫ్​ సమీక్ష

by Dishafeatures2 |
చైల్డ్​ పోర్నోగ్రఫీ కేసులపై సీఐడీ ఛీఫ్​ సమీక్ష
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: చైల్డ్​పోర్నోగ్రఫీకి సంబంధించిన వీడియోలను ఇంటర్​నెట్​లో అప్​లోడ్​చేసేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సీఐడీ ఛీఫ్ ​మహేశ్​భగవత్​ సిబ్బందికి సూచించారు. పదే పదే ఈ తరహా చర్యలకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. అవసరమనుకుంటే సస్పెక్ట్​ షీట్లు తెరవటంతో పాటు ముందస్తు అరెస్టులు చేయాలన్నారు.చైల్డ్​ పోర్నోగ్రఫీకి సంబంధించిన ముప్పయి ఒక్క కేసులపై ఆయన శనివారం తన కార్యాలయంలో సమీక్షా సమావేశం జరిపారు. ఈ కేసుల్లో ఇప్పటికే నలభైమూడు మందిని అరెస్టు చేసినట్టు సమావేశంలో పాల్గొన్న అధికారులు తెలిపారు. కాగా, సమీక్షా సమావేశం ముగియగానే మరో పది కేసుల్లో ఇరవై ఒక్క మందిని అరెస్టు చేసినట్టు సీఐడీ ఛీఫ్​ మహేశ్​భగవత్​కు సమాచారం అందింది.

చైల్డ్​ పోర్నోగ్రఫీకి సంబంధించిన నేరాలపై ప్రజల నుంచి సమాచారం తెలుసుకునేందుకు ఇప్పటికే ట్రిప్​లైన్స్​వ్యవస్థ పని చేస్తోందని సీఐడీ ఛీఫ్​ మహేశ్​ భగవత్​చెప్పారు. దీనికి స్పందన బాగా వస్తోందంటూ ట్రిప్​లైన్స్​ నుంచి అందిన సమాచారం మేరకు ఇప్పటివరకు నలభై నాలుగు కేసులు నమోదు చేసినట్టు వివరించారు. ఈ కేసులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి దర్యాప్తులు జరపాలని ఆయన సిబ్బందికి సూచించారు. నిందితులను అరెస్టు చేయటంతోపాటు వారికి శిక్షలు పడేలా పకడ్భందీ చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో డీసీపీ స్నేహా మెహ్రా, సైబర్​క్రైమ్స్​అడిషనల్​ఎస్పీ టీ.వీ.హనుమంతరావు, డీఎస్పీ గుణశేఖర్, సైబర్​క్రైమ్స్​పోలీస్​స్టేషన్​ఇన్స్​పెక్టర్​ప్రసాద్, సీఐ రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed