చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత

by Disha Web Desk 8 |
చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత
X

దిశ, సినిమా : ప్రముఖ మలయాళ నటి కనకలత (63) తన నివాసంలో కన్నుమూశారు. అయితే గత కొన్ని రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో సోమవారం మరణించినట్లు తెలుస్తోంది. నటి డిమోన్షియాతో బాధపడుతున్నట్లు సమాచారం. అయితే 2021లో ఈ వ్యాధి లక్షణాలు బయటపడగా,2022లో వైద్యులు ఎమ్‌ఆర్ఐ స్కాన్ ద్వారా తనకు ఈ డిసీజ్ ఉన్నట్లు నిర్ధారించారు.

ఇక ఈ నటి వివిధ భాషల్లో 360కి పైగా చిత్రాల్లో నటించింది. ఆమె నటించిన ప్రముఖ చిత్రాలలో ప్రియం, కన్నుఝూతి పొట్టుమతోట్టు, వర్ణపకిట్టు, స్పడికం, కిరీడం, రాజవింటేమకాన్, చిల్లు ఉన్నాయి. ఆమె తొలి చిత్రం ఉనర్తుపాట్టు.. ఈ సినిమాతో నటి చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. అలాగే అన్యార్, వక్కలతు నారాయణన్‌కుట్టి, చిరిక్కుడుక్క, అగ్రహారం వంటి సినిమాల్లో ఈమె పాత్రకు మంచి గుర్తింపు ఉంది. చాలా మంది సీనియర్ నటులతో ఈమె కలిసి నటించింది. ఇక కనకలత మరణంతో ఒక్కసారిగా చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటీనటులు కనకలత మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Next Story