హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదం.. చిన్నారి మృతి

by Gantepaka Srikanth |

హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదం.. చిన్నారి మృతి

హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదం.. చిన్నారి మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌(Hyderabad)లోని కాచిగూడ(Kacheguda)లో భారీ అగ్ని ప్రమాదం(Fire Accident) సంభవించింది. కాచిగూడలోని ఓ ఇంట్లోని ఏసీలో షార్ట్ సర్క్యూట్‌ జరిగింది. దీంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. ఆ సమయంలో ఇంట్లో ఇద్దరు చిన్నారులు ఉండగా.. ఒకరు ఊపిరాడక అక్కడిక్కడే మృతిచెందారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఫైరింజన్ల సాయంతో వచ్చి మంటలు అదుపుచేశారు. అనంతరం కేసు నమోదు చేసుకున్నారు. షార్ట్ సర్క్యూట్‌కు సంబంధించిన కారణాలపై ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story