చేవెళ్ల బస్సు ప్రమాదం.. టిప్పర్ యజమాని సంచలన స్టేట్‌మెంట్

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-06 03:33:35  IST  )

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ (Mirzaguda) సమీపంలో తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొట్టిన ఘటన రాష్ట్రాన్ని శోకసంద్రంలో ముంచిన విషయం తెలిసిందే.

చేవెళ్ల బస్సు ప్రమాదం.. టిప్పర్ యజమాని సంచలన స్టేట్‌మెంట్
X

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ (Mirzaguda) సమీపంలో తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొట్టిన ఘటన రాష్ట్రాన్ని శోకసంద్రంలో ముంచిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో మొత్తం 19 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, వారిలో ఎక్కువగా ఉద్యోగులు, విద్యార్థులే ఉండటంతో మృతుల కుటుంబాలు అంతులేని దు:ఖంతో విలపిస్తూనే ఉన్నారు. ఈ మేరకు జరిగిన ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు.

ఈ క్రమంలోనే ప్రమాదం జరిగిన సమయంలో టిప్పర్‌లోనే ఉండి ప్రాణాలతో బయటపడిన యజమాని లక్ష్మణ్ నాయక్ (Laxman Nayak) పోలీసుల ఎదుట సంచలన స్టేట్‌మెంట్ ఇచ్చాడు. బస్సు డ్రైవర్ వేగంగా వస్తూ రోడ్డుపై ఉన్న గుంతను తప్పించబోయి తమ టిప్పర్‌పైకి దూసుకొచ్చినట్లుగా తెలిపాడు. వెంటనే డ్రైవర్ ఆకాశ్ (Aakash) తనను నిద్రలో నుంచి లేపాడని.. అంతలోనే బస్సు టిప్పర్‌ను ఢీకొట్టిందని చెప్పుకొచ్చాడు. డ్రైవర్ ఆకాశ్ మద్యం తాగి వాహనం నడిపాడని, గుంతను తప్పించబోయి బస్సును ఢీకొట్టాడని జరుగుతోన్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని చెప్పడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

Next Story