- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలుడి గొంతు కోసిన చైనా మాంజా
చైనా మాంజా వాడకం మాత్రం ఆగడంలేదు. ఎక్కడో ఒకదగ్గర చైనా మాంజా వల్ల ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా నిజామాబాద్ లో చైనా మాంజా కారణంగా ఓ బాలుడికి తీవ్రగాయమైంది.

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో చైనా మాంజాపై బ్యాన్ విధించిన సంగతి తెలిసిందే. చైనా మాంజా అమ్మినా, కొనుగోలు చేసినా కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ చైనా మాంజా వాడకం మాత్రం ఆగడంలేదు. ఎక్కడో ఒకదగ్గర చైనా మాంజా వల్ల ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా నిజామాబాద్ లో చైనా మాంజా కారణంగా ఓ బాలుడికి తీవ్రగాయమైంది. శ్రీహాన్ సంక్రాంతి సెలవుల సంర్భంగా తన అమ్మమ్మ వాళ్ల ఇంటికి మెట్ పల్లికి వెళ్లాడు.
అక్కడ చిన్నపిల్లలతో కలిసి ఆడుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే బాలుడిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా వైద్యులు 20 కుట్లు వేశారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. చైనా మాంజా వాడొద్దని బాలుడి తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక ఈ ఏడాది సంక్రాంతి పండుగ రాకముందే హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో చైనా మాంజా కారణంగా పలువురు గాయపడ్డారు. మాంజా కారణంగా తీవ్రగాయాల పాలై మరణించిన ఘటనలు కూడా ఉన్నాయి.






