విమాన సిబ్బందితో అసభ్య ప్రవర్తన.. భారతీయుడిపై కేసు నమోదు

by Kema Shiva Kumar |   (  Updated:2025-04-22 09:31:53  IST  )

ఇటీవల కాలంలో ఎయిర్‌లైన్స్‌ (Airlines)లో కొందరు హల్‌చల్ చేస్తూ తోటి ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.

విమాన సిబ్బందితో అసభ్య ప్రవర్తన.. భారతీయుడిపై కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో ఎయిర్‌లైన్స్‌ (Airlines)లో కొందరు హల్‌చల్ చేస్తూ తోటి ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మరికొందరు సిబ్బందితో గొడవకు దిగుతూ.. పిడిగుద్దుల వరకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి సిబ్బందితో అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన ఓ ఫ్లైట్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భారత్‌ (India)కు చెందిన రజత్ (Rajath) అనే వ్యక్తి ఫిబ్రవరి 28న సింగపూర్ ఎయిర్‌లైన్స్‌ (Singapore Airlines)లో ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలోనే రజత్ ఫ్లైట్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళను ఏకంగా బాత్‌రూంలోకి లాక్కెళ్లేందుకు యత్నించాడు. దీంతో సదరు మహిళ గట్టిగా కేకలు వేయగా.. అడ్డుబోయిన ప్రయాణికులపై కూడా అతడు దాడికి దిగాడు. ఈ క్రమంలోనే బాధిత మహిళ ఫ్లైట్ షాంగై ఎయిర్‌పోర్టు (Shanghai Airport)లో దిగిన వెంటనే రజత్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ప్రాథమిక విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.

Next Story