- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. దంపతులు స్పాట్ డెడ్
జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం జనగామ-సూర్యపేట జాతీయ రహదారిపై వడ్డిచర్ల వద్ద కారు డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది.

దిశ, వెబ్ డెస్క్: జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం జనగామ-సూర్యపేట జాతీయ రహదారిపై వడ్డిచర్ల వద్ద కారు డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న దంపతులు మృతిచెందగా, ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. మృతులు నెల్లూరు జిల్లా మనుబోలు మండలం వడ్లపూడికి చెందిన దద్దోజు సురేశ్, దివ్యలు కాగా, గాయాలైన చిన్నారులను లోక్షణ, మోక్షజ్ఞగా గుర్తించారు. సురేశ్ కరీంనగర్‌లోని ఓ గ్రానైట్ కంపెనీలో పనిచేస్తున్నారు. స్వగ్రామంలో జరిగిన వివాహ వేడుకలో పాల్గొన్న అనంతరం భార్యపిల్లలతో కలిసి కారులో కరీంనగర్‌కు బయల్దేరారు. మార్గంమధ్యలో లింగాల ఘనపురం మండలం వడ్డిచర్ల నక్షత్ర గార్డెన్ వద్ద వారి వాహనం అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. సురేశ్ అక్కడికక్కడే మృతిచెందగా.. దివ్య 108 వాహనంలో ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయింది. పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని జనగామ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






