ఆగిఉన్న బస్సును ఢీకొట్టిన కారు.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-28 03:41:06  IST  )

చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును కారు ఢీకొనడంతో ఒకే కుటుంబంలోని ముగ్గురు దుర్మరణం పాలయ్యారు.

ఆగిఉన్న బస్సును ఢీకొట్టిన కారు.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు స్పాట్‌లోనే దుర్మరణం పాలైన విషాద ఘటన చిత్తూరు (Chittoor) జిల్లా బంగారుపాళ్యం మండల పరిధిలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు తిరుపతి - బెంగళూరు జాతీయ రహదారిపై శేషాపురం వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనక నుంచి కారు అతివేగంతో అదుపుతప్పి బలంగా ఢీకొంది. ఈ దుర్ఘటనలో కారులో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులు వరంగల్ (Warangal) జిల్లాకు చెందిన శ్రీధర్ రావు, లక్ష్మీ, అద్వికగా గుర్తించారు. బెంగళూరు నుంచి తిరుమలకు కారులో వెళ్తుండగా.. ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Next Story