కోదాడలో కల్వర్టును ఢీకొట్టిన కారు.. కారణం మద్యం మత్తా..? అతివేగమా..?

by Bhanu |

కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని కొమరబండ శివారులో జాతీయ రహదారి 365పై మంగళవారం ప్రమాదం జరిగింది.

కోదాడలో కల్వర్టును ఢీకొట్టిన కారు.. కారణం మద్యం మత్తా..? అతివేగమా..?
X

దిశ, కోదాడ : కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని కొమరబండ శివారులో జాతీయ రహదారి 365పై మంగళవారం ప్రమాదం జరిగింది. హైదరాబాదు నుండి విజయవాడ దిశగా వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి కల్వర్టును బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే కారులో మంటలు చెలరేగి, క్షణాల్లోనే కారు పూర్తిగా దగ్ధమైంది.

అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు. అయితే, ప్రమాద సమయంలో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు అప్రమత్తతతో కారు నుంచి బయటకు రావడంతో పెద్ద ప్రాణాపాయం తప్పింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ఘటన వల్ల హైవే పై కొంతసేపు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.


Next Story