- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బస్సు, జీపు ఢీ.. డ్రైవర్ మృతి
రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి చెందగా నాలుగేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డారు.

బస్సు, జీపు ఢీ.. డ్రైవర్ మృతి
నాలుగేళ్ల బాలుడికి తీవ్ర గాయాలు
దిశ, మక్తల్: మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని దండు గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి చెందగా నాలుగేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన గురువారం రాత్రి పది గంటల ప్రాంతంలో మున్సిపాలిటీ పరిధిలోని పెట్రోల్ బంకు దగ్గర జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి రాయచూర్ కు వెళ్తున్న కర్ణాటక చెందిన వోల్వో ఆర్టీసీ బస్సు, జీపును మక్తల్ చెరువు కట్ట పెట్రోల్ బంక్ సమీపంలో ఢీ కొట్టింది. ఈ సంఘటనలో దండు గౌడి చిన్నారెడ్డి (38) మృతి చెందగా బాబుకు (4) తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో బాబును మక్తల్ ఆస్పత్రి ప్రథమ చేసి జిల్లా ఆస్పత్రికి తరలించారు. దండు గౌడి చిన్నారెడ్డి మృత దేహాన్ని ప్రమాదం జరిగిన బస్సు ముందర ఉంచి మృతుని కుటుంబానికి న్యాయం జర్గాలని గ్రామస్తులు బంధువులు ధర్నా దిగారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న మక్తల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






