- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో మరో బస్సు ప్రమాదం.. కర్నూల్ తరహాలో మోటార్ సైకిల్‌ను ఈడ్చుకెళ్లిన బస్సు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శిరవెళ్ల గ్రామ సమీపంలో ఎక్స్ ఎల్ మోటార్ సైకిల్‌ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది. ఢీ కొట్టిన అనంతరం దాదాపు

దిశ, వెబ్ డెస్క్: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శిరవెళ్ల గ్రామ సమీపంలో ఎక్స్ ఎల్ మోటార్ సైకిల్‌ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది. ఢీ కొట్టిన అనంతరం దాదాపు వంద మీటర్ల వరకు దానిని ఈడ్చుకెళ్లింది. ప్రమాదంలో బైక్ ఉన్న ఇద్దరు అక్కడిక్కడే తీవ్రగాయాలతో మృతి చెందారు. ఢీకొట్టిన శ్రీవారి ట్రాలెవ్స్ బస్సుగా గుర్తించారు. చనిపోయిన ఇద్దరు వ్యక్తులు స్థానికులుగా తెలుస్తోంది.
అయితే ఈ బస్సు ప్రమాదం కర్నూలు తరహాలోనే ఉండటం ఆందోళనకు గురిచేస్తోంది. కర్నూలులో బైక్ ను ఢీ కొట్టి బస్సు ఈడ్చుకుని వెళ్లడంతో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధం అయింది. ఇక్కడ కూడా బస్సు మోటార్ సైకిల్ ను ఢీ కొట్టి వంద మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. కానీ బస్సుకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. మరోవైపు ఈ రోజే అల్లూరిసీతారామరాజు జిల్లాలోనూ బస్సు ప్రమాదం జరిగింది. బస్సు లోయలో పడటంతో తొమ్మిది మంది మరణించగా, 22 మంది గాయపడ్డారు. VIDEO






