ఏపీలో ఘోర ప్రమాదం.. పూర్తిగా కాలిపోయిన ట్రావెల్స్ బస్సు

by Ajay Maddhiboyina |

ఏపీలో మరో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా రాజుపాలెం వద్ద కావేరి ట్రావెల్స్ బస్సు ఇంజిన్ లో మంటలు చెలరేగాయి. ఇంజిన్ లో మంటలు గమనించి వెంటనే డ్రైవర్ బస్సును నిలిపివేశాడు.

ఏపీలో ఘోర ప్రమాదం.. పూర్తిగా కాలిపోయిన ట్రావెల్స్ బస్సు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మరో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా రాజుపాలెం వద్ద కావేరి ట్రావెల్స్ బస్సు ఇంజిన్ లో మంటలు చెలరేగాయి. ఇంజిన్ లో మంటలు గమనించి వెంటనే డ్రైవర్ బస్సును నిలిపివేశాడు. మంటలు వ్యాపించే క్రమంలోనే ప్రయాణికులంతా అటర్ట్ అయ్యి బస్సు నుండి కిందకు దిగేశారు. బస్సులో దాదాపు 36 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. ప్రయాణికులు అంతా సురక్షితంగా బయటపడటంతో ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదానికి గురైన బస్సు హైదరాబాద్ నుండి తిరుపతి వెళుతున్నట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఇదే ఏడాది ఏపీలో రెండు వరుస బస్సు ప్రమాదాలు ఆందోళన కలిగించిన సంగతి తెలిసిందే. మర్కాపురం జిల్లాలో మార్చి 26న జరిగిన బస్సు ప్రమాదంలో 13 మంది మరణించారు. ఈ ప్రమాదంలో ట్రావెల్స్ బస్సు టిప్పర్ లారీని ఢీ కొట్టడంతో మంటలు చెలరేగి బస్సులోని ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. అంతేకాకుండా మే 14న తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్నగూడెం వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, 16మందికి తీవ్రగాయాలు అయ్యాయి.

Next Story