- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జమ్ముకశ్మీర్‌లో కళ్ల ముందే కుప్పకూలిన భారీ భవనం.. షాకింగ్ వీడియో వైరల్
జమ్ముకశ్మీర్‌లో కురిసిన భారీ వర్షాలకు ఓ భవనం కుప్పకూలిపోయింది. జమ్ముకశ్మీర్‌లోని జాతీయ రహదారిపై నార్సు ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొండచరియలు భవనం పై పడటంతో నేలమట్టం అయ్యింది.

దిశ, వెబ్ డెస్క్: జమ్ముకశ్మీర్‌లో కురిసిన భారీ వర్షాలకు ఓ భవనం కుప్పకూలిపోయింది. జమ్ముకశ్మీర్‌లోని జాతీయ రహదారిపై నార్సు ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొండచరియలు భవనం పై పడటంతో నేలమట్టం అయ్యింది. ఇటీవల ఇలాంటి ఘటనలే చోటు చేసుకోవడంతో ప్రజలంతా ఇల్లను ఖాళీ చేసి వెళ్లిపోయారు. దీంతో కూలిన సమయానికి భవనంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
మరోవైపు కొందరు ఆ భవనం దగ్గరే నిలబడి ఉండగా కూలుతున్న సమయంలో పారిపోయి ప్రాణాలను కాపాడుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే జమ్ముకశ్మీర్ లో ఈ ఏడాది వరదలు బీభత్సం సృష్టించాయి. వరదల కారణంగా గ్రామాలు సైతం తుడిచిపెట్టుకుపోయాయి. వరుస ప్రమాదాలకు చెట్లను నరికివేస్తూ కొండలపై రోడ్లు వేయడమే కారణమని, టూరిజం కోసం ప్రకృతిని నాశనం చేయవచ్చని సుప్రీంకోర్టు హెచ్చరించింది. వీడియో






