రాష్ట్రంలో దారుణం.. మద్యం తాగించి బీటెక్ స్టూడెంట్‌పై అత్యాచారం

by Ajay Maddhiboyina |

హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. బీటెక్ విద్యార్థినిపై తోటి విద్యార్థి అత్యాాచారానికి పాల్పడ్డ ఘటన నగరంలోని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.

రాష్ట్రంలో దారుణం.. మద్యం తాగించి బీటెక్ స్టూడెంట్‌పై అత్యాచారం
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. బీటెక్ విద్యార్థినిపై తోటి విద్యార్థి అత్యాాచారానికి పాల్పడ్డ ఘటన నగరంలోని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న ఉదయ్ అనే విద్యార్థి తన స్నేహితురాలిని ఈ నెల 14న రాత్రి సమయంలో దిల్‌సుఖ్‌నగర్‌కు తీసుకువచ్చాడు. ఓ హోటల్‌లో టీ తాగిన తరవాత తిరిగి ఇద్దరూ కారులో ఇబ్రహీంపట్నం బయలుదేరారు. మార్గమధ్యలో మద్యం తీసుకున్న ఉదయ్ యువతిని ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి ఆమెకు సైతం మద్యం తాగించాడు. యువతి మద్యం మత్తులోకి జారుకోవడంతో ఇబ్రహీంపట్నంలోని ఓ గదికి తీసుకువెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. స్నేహితుడే అని న‌మ్మివెళితే అత్యాచారం చేయ‌డంతో యువ‌తి ఈ నెల 17న పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Next Story