హైదరాబాద్ లో దారుణ హత్య.. కత్తులతో నరికి, తుపాకీతో కాల్చి..

by Muthe.Rajitha |

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో దారుణ హత్య జరిగింది.

హైదరాబాద్ లో దారుణ హత్య.. కత్తులతో నరికి, తుపాకీతో కాల్చి..
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో దారుణ హత్య జరిగింది. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తిని దారుణంగా నరికి చంపారు దుండగులు. మల్కాజిగిరి జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘోర హత్య చోటు చేసుకుంది. సాకేత్ కాలనీలోని ఫోస్టర్ స్కూల్ సమీపంలో బైక్ మీద వెళ్తున్న రియల్టర్ రత్నంను దుండగులు కత్తులతో వెంబడించారు. కత్తులతో అనేకసార్లు నరికి, తుపాకీతో కాల్చి చంపి, అక్కడి నుండి దుండగులు పారిపోయారు.

స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. రత్నాన్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు తేల్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు.

Next Story