- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
BRS MLC: ఫామ్‌హౌజ్‌లో కోడిపందేలు.. ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డికి నోటీసులు

దిశ, వెబ్‌డెస్క్: మొయినాబాద్ మండల పరిధిలోని తొల్కట్టలోని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఫామ్ హౌస్‌లో భారీ ఎత్తున కోడి పందేల నిర్వహణ అంశం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. ఎమ్మెల్సీకి చెందిన 11 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఫాంహౌస్‌లో ఆంధ్రప్రదేశ్ (Andhra PradesH) లోని కోనసీమ (Konaseema) జిల్లా కాట్రేనికోన (Katrenekona) మండలానికి చెందిన వ్యాపారి భూపతిరాజు శివకుమార్ వర్మ (Bhupatiraju Shiva Kumar Varma) అలియాస్ గబ్బర్‌సింగ్ (Gabbar Singh) పందేలు నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు తేల్చారు. ఈ మేరకు ఇవాళ ఉదయం ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి మొయినాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులలో పేర్కొన్నారు.
కాగా, మంగళవారం తొల్కట్టలోని ఫామ్‌హౌజ్‌లో కోడిపందేలు, పేకాట, కేసినో నిర్వహిస్తున్నారనే సమాచారం రంగంలోకి దిగిన పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు. ఈ మేరకు మొత్తం 64 మందిని అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో భాగంగా భారీ క్యాసీనో మిషన్ (Casino Machine), కాయిన్స్ (Coins), 46 కోడి కత్తులతో పాటు రూ.30 లక్షల నగదు, 55 లగ్జరీ కార్లను సైతం సీజ్ చేశారు.పరారీలో ఉన్న మరికొందరి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. కాగా, తోలుకట్టలోని సర్వే నెంబర్ 165/A, 165/A2 /1లో 165/E లలో 11 ఎకరాలకు పైగా భూమిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి (BRS MLC Pochampally Srinivasa Reddy) అప్పట్లో చెన్నకేశవులు (Chennakeshavulu) అనే వ్యక్తి నుంచి భూమిని కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది.