- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నమ్మించి.. గొంతు కోసి.. చెల్లి, ఆమె భర్తను క్రూరంగా చంపిన అన్నలు..
యూపీ సోన్‌భద్రలో దారుణం చోటు చేసుకుంది. పరువు కోసం చెల్లి, ఆమె భర్తను నమ్మించి గొంతు కోసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. దుక్కాన అనే యువకుడు అదే గ్రామానికి చెందిన మున్నీతో ప్రేమలో పడ్డాడు. పెళ్లి చేసుకునేందుకు ఆమెను

దిశ, వెబ్ డెస్క్ : యూపీ సోన్‌భద్రలో దారుణం చోటు చేసుకుంది. పరువు కోసం చెల్లి, ఆమె భర్తను నమ్మించి గొంతు కోసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. దుక్కాన అనే యువకుడు అదే గ్రామానికి చెందిన మున్నీతో ప్రేమలో పడ్డాడు. పెళ్లి చేసుకునేందుకు ఆమెను తీసుకుని గుజరాత్ పారిపోయాడు. అక్కడే మ్యారేజ్ చేసుకున్నాడు. ఇలా చెల్లి పారిపోవడాన్ని సహించిన అన్నలు ఇద్దరు వారిద్దరికి ఊర్లోనే గ్రాండ్‌గా పెళ్లి చేస్తామని గుజరాత్‌కు వెళ్లి ఒప్పించారు. కొద్ది దూరం ట్రైన్‌లో వచ్చిన వారు.. ఆ తర్వాత తమ విలేజ్‌కు తీసుకుని వెళ్తున్నట్లు నమ్మించారు. కానీ హథినాలా దగ్గర బండి ఆపి.. టాయిలెట్ బ్రేక్ కోసమని చెప్పి అడవిలోకి వెళ్లారు. అక్కడే మున్నీ, ఆమె భర్తను చంపేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు.. ఆమె అన్నలు మున్నా కుమార్, రాహుల్ ఇందుకు కారణమని గుర్తించారు. అదుపులోకి తీసుకున్నారు.






