- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టిన ఎన్నికల పంచాయితీ దావత్
by Ajay Maddhiboyina |
పంచాయితీ ఎన్నికల దావత్ అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టింది. పార్టీ మధ్యలో ఏం జరిగిందో కానీ ఓ వ్యక్తి తమ్ముడితో ఘర్షణకు దిగి అతడిపై దాడి చేశాడు.

X
దిశ, వెబ్ డెస్క్: పంచాయితీ ఎన్నికల దావత్ అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టింది. పార్టీ మధ్యలో ఏం జరిగిందో కానీ ఓ వ్యక్తి తమ్ముడితో ఘర్షణకు దిగి అతడిపై దాడి చేశాడు. అంతే కాకుండా అడ్డు వచ్చిన తల్లిపైనా దాడి చేశాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఉల్లిగడ్డ లక్ష్మీపూర్‌లో చోటు చేసుకుంది. గ్రామంలో పంచాయితీ ఎన్నికల దావత్ జరగ్గా కళ్యాణ్, శ్రీనివాస్ అనే ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ పెద్దది కావడంతో కళ్యాణ్ తన తమ్ముడిపై కత్తితో దాడి చేశాడు. అడ్డు వెళ్లిన తల్లి లతపై సైతం కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీంతో ఇద్దరికీ తీవ్రగాయాలు కావడంతో జగిత్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డ్యూటీ డాక్టర్లు, సర్జన్ లేరు అని చెప్పడంతో వారిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
Next Story






