పాము కాటుతో బాలుడు మృతి

by Ratna Kumari |

పాము కాటుతో బాలుడు మృతి చెందిన ఘ‌ట‌న నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా బిజినేప‌ల్లి మండ‌లం స‌ల్క‌రిపేట గ్రామంలో చోటు చేసుకుంది.

పాము కాటుతో బాలుడు మృతి
X

దిశ, బిజినేపల్లి : పాము కాటుతో బాలుడు మృతి చెందిన ఘ‌ట‌న నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా బిజినేప‌ల్లి మండ‌లం స‌ల్క‌రిపేట గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. సల్కర్ పేట గ్రామానికి చెందిన మేకల బంగారయ్య, అంజనమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు ఆడపిల్లలు, ఒక కుమారుడు. అయితే శుక్రవారం రాత్రి ఇంటి ముందు నిద్రిస్తుండడంతో అర్ధరాత్రి కట్లపాము చరణ్(10) ను కాటు వేసి పక్కనే పాము ప‌డుకుంది. ఇది గమనించిన తల్లిదండ్రులు నాగర్ కర్నూల్ ఏరియా ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే బాలుడు మృతి చెందాడని వైద్యులు నిర్ధారించిన‌ట్టు తెలిపారు. ఒక్క‌గానొక్క‌ కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు శోకసముద్రంలో ఉన్నారు.

Next Story