- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ మూడు విమానాలకు బాంబు బెదిరింపు.. మెయిల్ పంపిన ఆగంతకుడు
దేశవ్యాప్తంగా ఇండిగో (Indigo) విమానాల సంక్షోభం ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ఇండిగో (Indigo) విమానాల సంక్షోభం ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. కానీ, పలు విమానాలకు మాత్రం ఆగంతకుల నుంచి బాంబు బెదిరింపు మెయిల్స్ పర్వం ఆగడం లేదు. ఈ నేపథ్యంలోనే ఇవాళ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న లుఫ్తాన్సా ఫ్లైట్, లండన్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న బ్రిటిష్ ఎయిర్‌వేస్, కన్నూరు నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఎయిరిండియా విమానంలో బాంబు పెట్టినట్లుగా ఉదయం ఎయిర్‌పోర్టు అధికారిక మెయిల్‌కు ఆగంతకుల నుంచి మెయిల్ వచ్చింది. దీంతో ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. రన్‌వేలో ఆ మూడు విమానాలు సురక్షితంగా ల్యాండింగ్ కాగా, వాటిని సీఐఎస్‌ఎఫ్ (CISF), బాంబ్ స్క్వాడ్ (Bomb Squad)తో కలిసి సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అనుమానం వచ్చిన ప్రతి బ్యాగేజీని చెక్ చేసి, ప్రయాణికులను ఎయిర్‌పోర్టు నుంచి బయటకు పంపుతున్నారు.






