- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్రమంగా డ్రగ్స్ రవాణా.. బాలీవుడ్ నటుడు విశాల్ బ్రహ్మ అరెస్ట్
స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2 ఫేమ్, బాలీవుడ్ నటుడు విశాల్ బ్రహ్మ (Vishal Bramha)ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు అరెస్ట్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2 ఫేమ్, బాలీవుడ్ నటుడు విశాల్ బ్రహ్మ (Vishal Bramha)ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు అరెస్ట్ చేశారు. సుమారు రూ.40 కోట్ల విలువైన నిషేధిత డ్రగ్స్‌ను అక్రమంగా తరలిస్తూ చెన్నై ఎయిర్‌పోర్ట్ (Chennai Airport)లో అడ్డంగా బుక్కయ్యాడు. ఈ డ్రగ్ రాకెట్ వెనుక నైజీరియా గ్యాంగ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. విశాల్ బ్రహ్మ వద్ద డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు దర్యాప్తును ప్రారంభించింది. అస్సాం (Assam)కు చెందిన నటుడు విశాల్ బ్రహ్మ ఇండస్ట్రీలో అవకాశాలు లేక ఆర్థిక సమస్యల వల్లే ఇలాంటి పనులు చేస్తున్నట్లుగా సమాచారం. కష్టపడకుండా డబ్బులు సంపాదించేందుకు కొందరు స్నేహితుల నైజీరియా ముఠాతో పరిచయాలు పెంచుకున్నట్లుగా తెలుస్తోంది.
విశాల్ బ్రహ్మను కాంబోడియా ట్రిప్‌కు పంపి భారత్‌కు డ్రగ్స్ చేరవేసేందుకు కొంత నగదు ఇస్తామని డగ్స్ మాఫియా ఆశ చూపినట్లగా పోలీసులు ఫస్ట్ ఇన్వెస్టిగేషన్‌లో తేలింది. కాగా, 2019లో కరణ్ జోహర్ (Karan Johar) నిర్మించిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2’ మూవీలో సమ్రాట్ పాత్రలో విశాల్ బ్రహ్మ కనిపించాడు. ఇటీవల ‘బిహూ అటాక్’ సినిమాలో కూడా నటించాడు, కానీ, ఆ మూవీ మేకర్స్ తనకు రెమ్యునరేషన్ ఇవ్వలేదంటూ పబ్లిక్‌గా ఆరోపణలు చేయడం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సినిమాలు లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతోన్న విశాల్ బ్రహ్మ డ్రగ్స్ దందాలోకి దిగి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.






