బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హౌస్ అరెస్ట్..

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-12 02:05:58  IST  )

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు (Ramchander Rao)ను పోలీసులు ఇవాళ ఉదయం హౌస్ అరెస్ట్ చేశారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హౌస్ అరెస్ట్..
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు (Ramchander Rao)ను పోలీసులు ఇవాళ ఉదయం హౌస్ అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్‌ (Jubilee Hills)లోని పెద్దమ్మ గుడి వద్ద కుంకుమార్చన నిర్వహించేందుకు నేడు హిందూ సంఘాలు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే, కార్యక్రమానికి జంట నగరాల్లోని బీజేపీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కార్యక్రమానికి తరలివస్తారనే సమాచారం మేరకు తాజాగా బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు అక్కడికి వెళ్లకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పెద్దమ్మ గుడి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీగా పోలీసులను మోహరించారు. అదేవిధంగా పలువురు కార్పొరేటర్లను గృహ నిర్బంధం చేశారు. ఇటీవల పెద్దమ్మ గుడి వద్ద హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టిన నేపథ్యంలో అధికారుల తీరుపై హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతోన్న విషయం విదితమే.


Also Read: పులివెందుల ZPTC ఉప ఎన్నిక పోలింగ్ షురూ.. ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి అరెస్ట్

Next Story