ఇండిగో ఫ్లైట్‌‌ను ఢీకొట్టిన పక్షి.. 162 మంది ప్రయాణికులు సేఫ్

by Kema Shiva Kumar |

అహ్మదాబాద్ ఎయిరిండియా ప్రమాద ఘటన తరువాత విమానాల్లో వరుస సాంకేతిక లోపాలు ప్రయాణికులను తీవ్రంగా కలవర పెడుతున్నాయి.

ఇండిగో ఫ్లైట్‌‌ను ఢీకొట్టిన పక్షి.. 162 మంది ప్రయాణికులు సేఫ్
X

దిశ, వెబ్‌డెస్క్: అహ్మదాబాద్ ఎయిరిండియా ప్రమాద ఘటన తరువాత విమానాల్లో వరుస సాంకేతిక లోపాలు ప్రయాణికులను తీవ్రంగా కలవర పెడుతున్నాయి. ల్యాడింగ్, టేకాఫ్‌ సమయంలో టెక్నికల్ సమస్యలతో అటే ఫ్లైట్ క్రూతో పాటు జనం సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ హైదరాబాద్‌లోని శంషాబాద్ ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్టు (Shamshabad International Airport)లో పెను ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ సమయంలో ఇండిగో ఫ్లైట్‌ను ఓ పక్షి ఢీకొట్టింది. అయితే, ఫైలట్ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశాడు. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో ఫ్లైట్‌లో సుమారు 162 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Next Story