తమిళనాడు ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. అక్రమంగా ఓటేసిన 10 మంది విదేశీయులు అరెస్ట్

by Kema Shiva Kumar |

"తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనం వెలుగులోకి వచ్చింది. నకిలీ పత్రాలతో అక్రమంగా ఓట్లు వేసిన 10 మంది విదేశీయులను చెన్నై పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు.

తమిళనాడు ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. అక్రమంగా ఓటేసిన 10 మంది విదేశీయులు అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు (Tamilnadu) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో భద్రతా లోపాలను ఎత్తిచూపుతూ ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. భారత పౌరసత్వం లేని విదేశీయులు కొందరు చెన్నై (Chennai)లో అక్రమంగా ఓట్లు వేసి పోలీసులకు దొరికిపోయారు. చెన్నై ఎయిర్‌పోర్టు, పరిసర ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న కొందరు వ్యక్తులను పోలీసులు ఇవాళ అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా, వారు విదేశీ పౌరులని చెన్నైలోని వివిధ నియోజకవర్గాల్లో అక్రమంగా ఓటు హక్కును వినియోగించుకున్నారని తేలింది.

3చెన్నై ఎయిర్‌పోర్ట్ ఇమ్మిగ్రేషన్ విభాగం, స్థానిక పోలీసులు జరిపిన తనిఖీల్లో ఈ అక్రమ ఓటర్లను గుర్తించారు. అయితే, వారంతా భారత ఓటరు గుర్తింపు కార్డులను (Voter ID) ఏ విధంగా పొందారు? వీరి వెనుక ఏ రాజకీయ శక్తులు ఉన్నాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విదేశాలకు తిరిగి వెళ్లే క్రమంలో చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో వారంతా పట్టుబడటంతో ఈ దొంగ ఓట్ల వ్యవహారం బయటపడింది. ప్రస్తుతం పోలీసులు నిందితులపై బీఎన్ఎస్, పాస్‌పోర్ట్ చట్టం కింద కేసులు నమోదు చేసి.. ఈ తంతంగం వెనుక ఉన్న మాస్టర్ మైండ్ కోసం గాలిస్తున్నారు.

Next Story