వ్యవసాయ పొలాల్లో పెద్దపులి సంచారం..

by Taduka Kalyani |

నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో అమ్రాబాద్ మండలం వటవర్లపల్లి గ్రామ సమీపంలో బుధవారం పట్టపగలు వ్యవసాయ పొలాల్లో పెద్దపులి సంచరించింది.

వ్యవసాయ పొలాల్లో పెద్దపులి సంచారం..
X

దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో అమ్రాబాద్ మండలం వటవర్లపల్లి గ్రామ సమీపంలో బుధవారం పట్టపగలు వ్యవసాయ పొలాల్లో పెద్దపులి సంచరించింది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టపగలు రైతులు వ్యవసాయ పొలాల్లో ఎద్దులతో భూమిని దున్నుతుండగా పెద్దపులి వారి వైపు పరిగెత్తుకుంటూ వచ్చే క్రమంలో భయంతో పరుగెడుతుండగా రైతులు శ్రీశైలం, సోమనాథం, ఓoకారం లకు స్వల్ప గాయాలైనాయి. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు పెద్దపులి సంచారం చేసిన ప్రదేశంలో పర్యటించి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారని తెలిసింది.

Next Story