బెట్టింగ్ యాప్స్ కేసు.. హీరో రానాకు మరోసారి ఈడీ నోటీసులు

by Kema Shiva Kumar |

బెట్టింగ్ యాప్ కేసు (Betting Apps Case)లో ఈడీ (Enforcement Directorate) విచారణను మరింత వేగవంతం చేసింది.

బెట్టింగ్ యాప్స్ కేసు.. హీరో రానాకు మరోసారి ఈడీ నోటీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: బెట్టింగ్ యాప్ కేసు (Betting Apps Case)లో ఈడీ (Enforcement Directorate) విచారణను మరింత వేగవంతం చేసింది. ఇప్పటికే పలు బెట్టింగ్ యాప్‌ల తరఫున ప్రచారం చేసిన పలువురు సినీ ప్రముఖులకు ఈనెల 21న నోటీసులు జారీ చేశారు. వారిలో దగ్గుబాటి రానా (Daggubati Rana), ప్రకాశ్‌రాజ్, విజయ్‌ దేవరకొండ, మంచు లక్ష్మి ఉన్నారు. అయితే, దగ్గుబాటి రానాను ఈ నెల 23న, ప్రకాశ్‌రాజ్‌‌ను 30న, విజయ్‌ దేవరకొండను ఆగస్టు 6న, మంచులక్ష్మిని ఆగస్టు 13న విచారణకు హాజరుకావాలంటూ ఈడీ అధికారులు ఆ నోటీసులలో పేర్కొన్నారు. వాస్తవానికి ఇవాళ దగ్గుబాటి రానా ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. తనకు షూటింగ్ షెడ్యూల్ ఉందని, అందుకే విచారణకు హాజరు కాలేకపోతున్నానని వారికి సమాచారం అందజేశాడు. తనకు మరింత ఇవ్వాలని దగ్గుబాటి రానా అధికారులను రిక్వెస్ట్ చేశారు. అందుకు స్పందించిన ఈడీ ఆగస్టు 11న విచారణకు హాజరు కావాలంటూ తాజాగా మరో నోటీసు జారీ చేసింది.

Next Story