ఒకే కంపెనీ.. ప్రేమలో మునిగి తేలారు.. పెళ్లికి నో చెప్పడంతో యువతి ఆత్మహత్య

by Sujitha Rachapalli |

ఉత్తరప్రదేశ్ నోయిడాలో విషాదం చోటు చేసుకుంది. గరీ చౌకండీలోని ఓ కంపెనీలో పని చేస్తున్న ఇద్దరికి మంచి జీతం. అమ్మాయి, అబ్బాయి

ఒకే కంపెనీ.. ప్రేమలో మునిగి తేలారు.. పెళ్లికి నో చెప్పడంతో యువతి ఆత్మహత్య
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ నోయిడాలో విషాదం చోటు చేసుకుంది. గరీ చౌకండీలోని ఓ కంపెనీలో పని చేస్తున్న ఇద్దరికి మంచి జీతం. అమ్మాయి, అబ్బాయి మధ్య ఉన్న స్నేహం మూడు నెలల క్రితం ప్రేమగా మారింది. దీంతో భవిష్యత్తును చాలా గొప్పగా ఊహించుకుంది యువతి. ఇద్దరి మధ్య ఇచ్చుకున్న హామీలను తలుచుకుంటూ పెళ్లి చేసుకోవాలని ఆరాటపడింది. అయితే మ్యారేజ్ పాయింట్ వచ్చే సరికి అబ్బాయి భాను సింగ్ యూ టర్న్ తీసుకున్నాడు. దీంతో ప్రేమ పేరుతో చేసిన నమ్మకద్రోహాన్ని తట్టుకోలేకపోయిన అమ్మాయి.. ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయింది. బాధిత తల్లి ఫిర్యాదు మేరకు అబ్బాయిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారిస్తున్నారు.

Next Story