దర్శన్‌ కేసు తరహాలో కర్ణాటకలో మరో దారుణం

by velandi.Saikiran |

కర్ణాటక రాష్ట్రంలో ( KARNATAKA) మరో దారుణం జరిగింది. రేణుక స్వామి (Renuka Swamy) హత్యను తలపించేలా మరో దారుణ ఘటన

దర్శన్‌ కేసు తరహాలో కర్ణాటకలో మరో దారుణం
X

దిశ, వెబ్ డెస్క్: కర్ణాటక రాష్ట్రంలో ( KARNATAKA) మరో దారుణం జరిగింది. రేణుక స్వామి (Renuka Swamy) హత్యను తలపించేలా మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతిని వేధిస్తున్నాడని... యువకుడిపై క్రూరంగా దాడి చేశారు కొంతమంది యువకులు. అడవిలోకి తీసుకువెళ్లి యువకుడి బట్టలు విప్పి ప్రైవేట్ పార్ట్స్ పైన దాడి చేశారు. కర్రలు అలాగే రాడ్లతో... గ్యాంగ్ దాడి చేసింది.

బెంగళూరులోని సోలదేవనహళ్లికి (Soladevanahalli) చెందిన కుశాల్ కు ( Kushal) అలాగే ఓ యువతి మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది. అయితే కొంతకాలం క్రితం ఇద్దరికీ బ్రేకప్ అయిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కుశాల్ తర్వాత మరో యువకుడిని లవ్ చేసింది ఆ యువతి. అనంతరం తనకు కుశాల్ అసభ్యకర మెసేజ్ లు పంపిస్తున్నాడని యువకుడికి చెప్పింది ఆ యువతి.

దీంతో కుశాల్ ను మాట్లాడుకుందామని పిలిచి దాడి చేశారు మరో ప్రియుడు, అతని గ్యాంగ్. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సంఘటన రేణుక స్వామి హత్యను తలపించేలా ఉందని కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ సంఘటన ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story