- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బంగ్లాదేశ్ To హైదరాబాద్..! కట్ చేస్తే వ్యభిచార ముఠా గుట్టు రట్టు
హైదరాబాద్ (Hyderabad) చూపిస్తానంటూ ఓ బంగ్లాదేశ్ (Bangladesh) మైనర్ బాలికను నమ్మించి ఏకంగా వ్యభిచారం రొంపికి దింపిన ఘటన నగర పరిధిలోని బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ (Hyderabad) చూపిస్తానంటూ ఓ బంగ్లాదేశ్ (Bangladesh) మైనర్ బాలికను నమ్మించి ఏకంగా వ్యభిచారం రొంపికి దింపిన ఘటన నగర పరిధిలోని బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మెహదీపట్నంలో నివాసం ఉంటున్న షహనాజ్ (Shahanaz), హజీరా (Hazeera) అనే యువతులు ఓ మైనర్ బాలికను బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్ చూపిస్తామని చెప్పి అక్రమంగా ఇక్కడికి తీసుకొచ్చారు. ఓ ఆటో డ్రైవర్ సాయంతో బాలికను ఓ హోటల్ గదిలో బంధించి వ్యభిచారం చేయించారు.
అయితే, చాకచక్యంగా షహనాజ్, హజీరా నుంచి తప్పించుకున్న ఆ బాలిక ఏకంగా బండ్లగూడ పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. తనను బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా హైదరాబాద్‌కు తీసుకొచ్చారని, చిత్రహింసలు పెట్టి పాడు పనులు చేయించారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేసింది. దీంతో అప్రమత్తమైన బండ్లగూడ పోలీసులు (Bandlaguda Police) కేసు నమోదు చేసుకుని వ్యభిచార ముఠా గుట్టును రట్టు చేశారు. ఈ మేరకు మొత్తం ఆరుగురు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు వ్యభిచార గృహ నిర్వహకులు, మహారాష్ట్రకు చెందిన ఇద్దరు మహిళలు, కోల్‌కతాకు చెందిన ఇద్దరు మహిళలను ఉన్నారు.






