మైనర్‌పై లైంగిక దాడికి యత్నం.. ఇద్దరు అరెస్ట్

by Chintha Aamani |   (  Updated:2025-04-30 15:25:07  IST  )

రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం లోని పెంజర్ల గ్రామంలో

మైనర్‌పై లైంగిక దాడికి యత్నం.. ఇద్దరు అరెస్ట్
X

దిశ,కొత్తూరు : రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం లోని పెంజర్ల గ్రామంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఏప్రిల్ 28న రాత్రి వేళ ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ మైనర్ బాలికపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి ప్రయత్నించారు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి మంగళవారం రిమాండుకు తరలించారు. ఈ కేసు గురించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పెంజర్ల గ్రామానికి చెందిన బీర్ల రమేష్, గోదా కృష్ణయ్య అనే ఇద్దరు వ్యక్తులు ఒంటరిగా ఉన్న బాలిక ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి ఆమెపై లైంగిక దాడికి పాల్ప డబోయారు. వెంటనే అప్రమత్తమైన బాలిక వారి నుంచి తప్పించుకుని సమీపంలోని ఇంటి వారికి విషయం తెలియజేసింది. బాధితురాలి తరపున స్థానికులు ఫిర్యాదు చేయడంతో కొత్తూరు పోలీసులు తక్షణమే చర్యలు చేపట్టి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో మంగళవారం నిందితులైన బీర్ల రమేష్ గోదా కృష్ణయ్యలను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ నరసింహారావు వెల్లడించారు.

Next Story