కారు నీళ్లు పడ్డాయని దాడి.. మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ మామ అరెస్ట్

by Kema Shiva Kumar |

మాజీ క్రికెటర్, ఎంపీ యూసుఫ్ పఠాన్ మామను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.

కారు నీళ్లు పడ్డాయని దాడి.. మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ మామ అరెస్ట్
X

దిశ, వెబ్‌‌డెస్క్: భారత మాజీ క్రికెటర్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ యూసుఫ్ పఠాన్ (Yusuf Pathan) మామ, ఆయన కుమారుడిని ముంబై పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. రోడ్డుపై వెళ్తున్న కారు వెళ్తుండగా తమపై నీళ్లు పడ్డాయనే కారణంతో ఓ వ్యక్తితో పాటు అతడి కుటుంబంపై దాడి చేసినట్లు వీరిపై ఆరోపణలు ఉన్నాయి. వివరాల్లోకి వెళితే.. రెండు రోజుల క్రితం ముంబైలోని బైకుల్లా (Byculla) ప్రాంతంలో బాధితుడు తన కారులో వెళ్తుండగా, రోడ్డుపై ఉన్న గుంతలోని నీరు నిందితుల్లో ఒకరిపై పడింది. దీంతో ఆగ్రహానికి గురైన యూసుఫ్ పఠాన్ మామ, అతడి కుమారుడు బాధితుడితో పాటు అతడి కుటుంబంపై విచక్షణారహితంగా దాడి చేశారు.

బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు యూసుఫ్ పఠాన్ మామతో పాటు అతడి కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, మరొకరు పరారీలో ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలంలోని సీసీ టీవీ ఫుటేజ్, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను సేకరించారు. దాడికి ఉపయోగించిన బాంబూ స్టిక్స్, బేస్ బాల్ బ్యాట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Next Story