- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బస్సు, ర్యాపిడో డ్రైవర్ల వేధింపులపై అరెస్టులు
బస్సు టికెట్ బుకింగ్ స మయంలో వివరాలు ఇవ్వడంతో ఓ విద్యార్ధిని వేధింపులకు గురైంది. ర్యాపి డోలో ప్రయాణించిన మరో విద్యార్ధిని ఓ ఆటో డ్రైవర్ అధికంగా చెల్లించాలని భయపెట్టించాడు.

16 రోజుల్లో 81 కేసులు
మహిళలకు వేధింపులు
షీ టీమ్స్ కఠిన చర్యలు
బస్సు, ర్యాపిడో డ్రైవర్ల వేధింపులపై అరెస్టులు
వెంటపడ్డ వ్యక్తిపై కేసు నమోదు
దిశ, సిటీక్రైం : బస్సు టికెట్ బుకింగ్ స మయంలో వివరాలు ఇవ్వడంతో ఓ విద్యార్ధిని వేధింపులకు గురైంది. ర్యాపి డోలో ప్రయాణించిన మరో విద్యార్ధిని ఓ ఆటో డ్రైవర్ అధికంగా చెల్లించాలని భయపెట్టించాడు. భర్త లేని మహిళను ఇంటి పక్కన ఉండే వ్యక్తి వేధించాడు. పెద్దలు నచ్చజెప్పినా బుద్ధి మారకుండా వెంటపడ్డాడు. ఇలా మహిళను భయాందోళనుకు గురి చేసిన వ్యక్తులను షీ టీమ్స్ జైలుకు పంపింది. మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ పరిధిలో జనవరిలో 16 నుంచి 31వ తేది వరకు మొత్తం 81 కేసులను నమోదు చేసింది. 56 మేజర్లు, 25 మంది మైనర్లను అరెస్టు చేసింది.
బస్సు టికెట్ బుక్ చేసుకుంటే..
హైదరాబాద్ కు చెందిన ఓ విద్యార్థిని పరీక్ష రాసేందుకు నగర శివారు ప్రాం తానికి వెళ్ళాల్సి వచ్చింది. దీంతో విద్యా ర్థి ని ఓ ప్రైవేటు బస్సు లో తన వివరాలు, ఫోన్ నెంబరును నమోదు చేసి టికెట్ ను బుక్ చేసుకుంది. ఆ తర్వాత కొద్ది రోజులకు బస్సు డ్రైవర్ బుకింగ్ సమయంలో విద్యార్ధిని నమో దు చేసుకున్న ఫోన్ నెంబరుకు మెసేజ్ లు, వాట్సాప్ కాల్స్ చేస్తూ వేధించడం మొదలు పెట్టాడు. ఈ వేధింపులకు తట్టుకోలేక విద్యార్ధిని షీ టీమ్స్ కు ఫి ర్యాదు చేసింది. అరెస్టు చేసి పోలీసులు జైలుకు పంపారు.
బస్సు టికెట్ బుక్ చేసుకుంటే..
రాపిడో లో ఆటో బుక్ చేసుకుంటే--
హైదరాబాద్ కు చెందిన ఓ ఐటీ ఉద్యోగిని ఆఫీసులో తన విధులు ముగించుకుని రాపిడోలో ఆటో బుక్ చేసుకుంది. ఆటోలో ఎక్కిన కొద్ది దూరం రాగానే ఆటో డ్రైవర్ అధికంగా పేమెంట్ చేయాలని డిమాండ్ చేశాడు. దీనికి యువతి నిరాకరించడంతో అస భ్యంగా మాట్లాడడం మొదలు పెట్టాడు. గట్టిగా అరిచాడు. దీంతో బెంబేలెత్తిపోయిన యువతి ఆటోను ఆపమని కోరి నా అతని మరింత వేగంగా ఆటోను నడిపించాడు. యువతి షీ టీమ్స్‌కు ఫోన్ చేయడంతో పోలీసులు స్పందించి ఆటో డ్రైవర్ ను అరెస్టు చేశారు.
రీల్స్ పంపించి సతాయించాడు--
నగరంలో భర్త లేని ఓ మహిళ ఉద్యోగం చేసుకుంటు జీవనం సాగిస్తుంది. ఇంటి పక్కన ఉంటున్న ఓ వ్యక్తి పరిచయం అయ్యి ఆమెకు ఏదైనా సహాయం కావా లంటే చేస్తానని నమ్మించాడు. ఆ తర్వాత ఫోన్ నెంబరును తీసుకున్నాడు. రీల్స్, వాట్సాప్ కాల్స్, విడియోస్ పం పిస్తూ ఆమెను సతాయించాడు. విష యాన్ని మహిళ పెద్దలకు చెప్పడంతో వారంతా కౌన్సెలింగ్ ఇచ్చినా అతని బుద్ధి మారలేదు. ఇంకా వెంటపడుతు ఆమెకు అభద్రత భావాన్ని స్రుష్టించడంతో బాధిత మహిళ షీ టీమ్స్ ను ఆశ్రయించింది. పోలీసులు అరెస్టు చేసి కేసును నమోదు చేశారు. మహిళలు, విద్యార్ధినిలు, యువతులు ఎవరు కూడా పోకిరీలు, ఇతర వ్యక్తుల చేష్టలకు భయపడాల్సిన అవసరం లేదని మీకు ఏదైనా సమస్య ఎదురైనా, అభద్రత అనిపించినా వెంటనే డయల్ 100 లేదా మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ షీ టీమ్స్ వాట్సాప్ నెంబరు 87126 62111కు ఫిర్యాదు చేయొచ్చని డీసీపీ ఉషారాణి తెలిపారు.






