- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్రమ మద్యం పట్టివేత.. కేసు నమోదు
by Taduka Kalyani |
కర్ణాటక నుంచి గద్వాలకు అక్రమ మద్యం నిత్యం సరఫరా అవుతూనే ఉంది.

X
దిశ, గద్వాల: కర్ణాటక నుంచి గద్వాలకు అక్రమ మద్యం నిత్యం సరఫరా అవుతూనే ఉంది. ఎక్సైజ్ శాఖ తనిఖీలు చేస్తున్నప్పటికీ అక్రమ మద్యం రవాణా ఆగడం లేదు. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం కర్ణాటక నుంచి ఆర్టీసీ డీలక్స్ బస్సులో ఒరిజినల్ విస్కీ 26 బాటిల్స్ కేటీ దొడ్డికి చెందిన తాయప్ప అనే వ్యక్తి తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డాడు.
ఈ సందర్భంగా ఎక్సైజ్ అధిాకారులుమాట్లాడుతూ.. నమ్మదగిన సమాచారం మేరకు జోగులాంబ గద్వాల జిల్లా నందిని చెక్ పోస్ట్ దగ్గర వాహనాల తనిఖీలో భాగంగా కర్ణాటక రాష్ట్రంలోని రాయిచూర్ నుండి అక్రమంగా మద్యం తరలిస్తుండగా పట్టుకొని మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. తాయప్ప పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
Next Story






