- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP: పాదచారులపైకి దూసుకెళ్లిన కారు.. స్పాట్‌లోనే నలుగురు దుర్మరణం
విజయనగరం జిల్లా పేరాపురం జాతీయ రహదారిపై ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: పాదచారులపైకి కారు దూసుకెళ్లి నలుగురు దుర్మరణం పాలైన హృదయ విదారక ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం (Vizianagaram) జిల్లా పేరాపురం (Perapuram) జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. విశాఖపట్నంకు చెందిన ఇరిగేషన్ కాంట్రాక్టర్ శ్రీనివాసరావు (Srinivasa Rao) ప్రయాణిస్తున్న కారు పేరాపురం జాతీయ రహదారిపై అత్యంత వేగంగా వెళ్తోంది. ఈ క్రమంలో నియంత్రణ కోల్పోయిన కారు.. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గురు పాదచారులపైకి దూసుకెళ్లింది. అనంతరం వేగంగా వెళ్లి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది.
నలుగురు మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు
ఈ ఘోర ప్రమాదంలో కారులో ఉన్న కాంట్రాక్టర్ శ్రీనివాసరావుతో పాటు, కారు కింద పడి ముగ్గురు పాదచారులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం విజయనగరంలోని మహారాజా ఆసుపత్రి (Maharaja Hospital)కి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ప్రమాదం జరిగిన స్పాట్‌ను జిల్లా ఎస్పీ దామోదర్ (SP Damodar) స్వయంగా పరిశీలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. కారు లారీని ఢీకొట్టిన ధాటికి వాహనం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. అనంతరం మృతుల కుటుంబాలకు సమాచారం అందించినట్లుగా వారు వెల్లడించారు.






