- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP: రాష్ట్రంలో మరో పరువు హత్య.. కూతురి ప్రాణాలు తీసిన కన్నతండ్రి
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశం దూసుకెళ్తోన్న గ్రామాల్లో కులాల మధ్య కుంపట్లు ఇప్పటికీ చల్లారడం లేదు.

దిశ, వెబ్‌డెస్క్: శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశం దూసుకెళ్తోన్న గ్రామాల్లో కులాల మధ్య కుంపట్లు ఇప్పటికీ చల్లారడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఒకచోట పరువు హత్యలు చోటుచేసుకుంటున్నాయి. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా (Anantpur District) గుంతకల్లు (Guthakallu) మండల పరిధిలోని కసాపురం (Kasapuram) గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. గ్రామ శివారులో ఓ యువతి దారుణ హత్యకు గురైన ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారం మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులకు విచారణలో సంచలన విషయం తెలిసింది. యువతిని హత్య చేసిందే కన్న తండ్రేనని తేలింది. అయితే, గ్రామానికి చెందిన తుపాకుల రామాంజనేయులు (Ramanjaneyulu) చిన్న కూతురు భారతి ప్రేమలో పడింది. అయితే, ప్రేమించిన వాడు వేరే కులం వాడు కావడంతో ఇంట్లో వాళ్లు భారతిని మందలించారు. అయినా యువతి మాట వినకపోవడం ఎక్కడ విషయం బయటపడుతుందోనని అనుకున్న తండ్రి రామాంజనేయులు కూతురిని ఇంట్లోని కొట్టి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని ఊరు బయట కొండ ప్రాంతానికి తీసుకెళ్లి డెడ్‌బాడీపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. విషయం బయటకు పొక్కడంతో నిందితుడు నేరుగా పోలీసుల ఎదుట లొంగిపోయాడు.






