దేశంలో మరో సంచలనం.. కోల్‌కతాలో లా స్టూడెంట్‌పై గ్యాంగ్ రేప్

by Kema Shiva Kumar |   (  Updated:2025-06-27 08:46:56  IST  )

ఆర్జీ కర్‌ మెడికల్‌ కాలేజీలో విద్యార్థినిపై హత్యాచారం చేసి అతి క్రూరంగా హతమార్చిన ఘటన మరువక ముందే దేశంలో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది

దేశంలో మరో సంచలనం.. కోల్‌కతాలో లా స్టూడెంట్‌పై గ్యాంగ్ రేప్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్జీ కర్‌ మెడికల్‌ కాలేజీలో విద్యార్థినిపై హత్యాచారం చేసి అతి క్రూరంగా హతమార్చిన ఘటన మరువక ముందే దేశంలో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. సౌత్ కోల్‌కతా (South Kolkata)లోని కాస్బా (Casbah) ప్రాంతంలో ఉన్న లా కాలేజీలో 25న రాత్రి 7.30 సమయంలో ఓ విద్యార్థినిపై కాలేజీ పని చేసే వ్యక్తితో పాటు మరో ఇద్దరు విద్యార్థులు గ్యాంప్‌ రేప్‌‌ (Gang Rape)కు పాల్పడ్డారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితులు మనోజిత్ మిశ్రా (31), జైబ్ అహ్మద్ (19), ప్రమిత్ ముఖోపాధ్యాయ్(20)లను అరెస్ట్ చేశారు. అదేవిధంగా వారి వద్ద ఉన్న మొబైల్ ఫోన్లకు కూడా సీజ్ చేశారు. ఈ మేరకు ఇవాళ ఆ ముగ్గురు నిందితులను అలీపూర్ కోర్టులో హాజరుపరచగా.. కోర్టు వారిని జూలై 1 వరకు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ తీర్పును వెలువరించింది.

Next Story