- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Phone Tapping Case: రేపు సుప్రీంకోర్టుకు సిట్ నివేదిక
Phone Tapping Case: రేపు సుప్రీంకోర్టుకు సిట్ నివేదిక

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే దక్కన్ కిచెన్ యజమాని నందకుమార్‌ను సిట్ విచారించి.. వాంగ్మూలాన్ని సిట్ రికార్డు చేసింది. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు విచారణ నేటితో ముగిసింది. ప్రభాకర్‌రావు కుమారుడు నిశాంత్‌రావు ఆర్థిక లావాదేవీలపై కూడా సిట్ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. అయితే.. మొత్తం 14 రోజుల సుదీర్ఘ విచారణలో ప్రభాకర్‌రావు ఏం చెప్పారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి పెన్ డ్రైవ్‌ను సిట్ అధికారులు కీలక ఆధారంగా భావించారు. ప్రభాకర్ రావు ఎస్ఐబీ చీఫ్‌గా పని చేసిన కాలంలో పెన్ డ్రైవ్‌లో ట్యాపింగ్ వివరాలు స్టోర్ చేసినట్లు సిట్ గుర్తించింది. ఈ పెన్ డ్రైవ్ డేటాను ప్రభాకర్ రావు ముందు పెట్టి మరీ విచారించింది సిట్. అయితే 6 వేల ఫోన్ నెంబర్లు ఉన్నప్పటికీ పెన్‌డ్రైవ్‌పై ప్రభాకర్ రావు ఎలాంటి జవాబు ఇచ్చారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ కేసులో పూర్తి నివేదికను రేపు సుప్రీంకోర్టులో సిట్ సమర్పించనుంది.






