- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో మరో తీవ్ర విషాదం.. ఇంజినీరింగ్ విద్యార్థి బలవన్మరణం
by Kema Shiva Kumar |
ఉరేసుకుని ఓ ఇంజినీరింగ్ చదువుతోన్న విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన మేడ్చల్ (Medchal) జిల్లాలోని నారపల్లి (Narapally)లో చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఉరేసుకుని ఓ ఇంజినీరింగ్ చదువుతోన్న విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన మేడ్చల్ (Medchal) జిల్లాలోని నారపల్లి (Narapally)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కళాశాల హాస్టల్ గదిలో విద్యార్థి సాయితేజ (Saiteja) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే అతడి వేధింపులకు కారణం సీనియర్లేనని తోటి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అతడితో బలవంతంగా మద్యం తాగించి.. బార్‌లో రూ.10 వేల బిల్లు కట్టాలని సాయితేజపై ఒత్తిడి చేశారని పేర్కొన్నారు. దీంతో అతడు తీవ్ర మనస్తాపానికి గురై ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. కళాశాల యాజమాన్యం, తోటి విద్యార్థుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు.
Next Story






