రోడ్డు ప్రమాదంలో అన్న మృతి.. త‌మ్ముడికి తీవ్ర గాయాలు

by Ratna Kumari |

రోడ్డు ప్రమాదంలో అన్న మృతి చెందగా.. తమ్మునికి తీవ్ర గాయాలైన ఘటన వనపర్తి మండల పరిధిలోని చిమనగుంటపల్లి గ్రామ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది.

రోడ్డు ప్రమాదంలో అన్న మృతి.. త‌మ్ముడికి తీవ్ర గాయాలు
X

దిశ‌, వ‌న‌ప‌ర్తి రూరల్‌ : రోడ్డు ప్రమాదంలో అన్న మృతి చెందగా.. తమ్మునికి తీవ్ర గాయాలైన ఘటన వనపర్తి మండల పరిధిలోని చిమనగుంటపల్లి గ్రామ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. బిజినేపల్లి మండలం మహాదేవునిపేట గ్రామానికి చెందిన శివయ్య ,లింగమయ్యలు ఇద్దరు అన్నదమ్ములు. వీరిద్దరూ నిత్యం కలిసి సెంట్రింగ్ పని చేస్తూ ఉండేవారు. రోజు మాదిరిగానే స్వగ్రామం నుంచి బైకుపై వనపర్తి కి వస్తుండగా చిమనగుంటపల్లి శివారులో హఠాత్తుగా కుక్క అడ్డువ‌చ్చింది. దీంతో కుక్క ను తప్పించబోయి బైకు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభానికి ఢీకొట్టడంతో అన్న శివయ్య (30)అక్కడికక్కడే మృతిచెందగా.. తమ్మునికీ కాలు విరగడంతో పాటు తీవ్ర గాయాలయ్యాయి. వీరి తండ్రి పర్వతాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రూరల్ ఎస్సై హృసికేష్ తెలిపారు.

Next Story